Friday, November 15, 2024

ఫ్యాబ్‌ఇండియా ఐపీవో దరఖాస్తు

ఫ్యాబ్‌ఇండియా లిమిటెడ్‌ ఐపీవో అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది. దీంతో భారత్‌లో తొలి ఈఎస్‌జీ(ఎన్విరాన్‌మెంటల్‌, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌) ఐపీవో సిద్ధమవుతోంది. ప్రెష్‌ ఇష్యూ ద్వారా రూ.500 కోట్ల వరకు సేకరించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు లేదా షేర్‌ హోల్డర్లు 25,050,543 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనున్నారని ఫ్యాబ్‌ఇండియాతెలిపింది. ఫ్యాబ్‌ఇండియా ప్రమోటర్లు గిఫ్ట్‌ షేర్లు ఇవ్వనున్నట్టు ప్రతిపాదించింది.

ఫ్యాబ్‌ఇండియా 50 వేలకుపైగా మంది హస్తకళాకారులకు సాధికారతను అందిస్తోంది. కళాకారుల్లో 64 శాతం మంది మహిళలే కావడం విశేషం. సాటి మహిళలకు ఫ్యాబ్‌ఇండియా పనిచేసేవారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫ్యాబ్‌ఇండియాలో 70 శాతం మంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. సుస్థిర వ్యవసాయ పద్దతులను ఆచరించడమే లక్ష్యంగా 2200 మంది రైతులతో నేరుగా, 10,300 మంది రైతులతో అసొసియేట్స్‌ ద్వారా పరోక్షంగా ఫ్యాబ్‌ఇండియా కృషి చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement