ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఎఫ్2కి ..ఎఫ్3 కథనంలో చాలా మార్పులు ఉన్నాయి. మరి ఈ చిత్రం హిట్టా ఫట్టా తెలుసుకుందాం..
కథేంటంటే.. లోకంలో పంచభూతాలతో పాటు మరో భూతం ఉంది.. అదే డబ్బు అనే కోణంలో ఎఫ్3 కథ మొదలైంది. వెంకటేష్, వరుణ్ తేజ్ .. డబ్బు, బంగారం అంటే ఆశ పడే భార్యలకు భర్తలుగా కనిపించారు. బాగా డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడే వీరికి, లోపాలు కూడా ఉంటాయి. వెంకీకి రేచీకటి ఉంటే, వరుణ్ కి నత్తి ఉంటుంది. మరి తమ లోపాలను కవర్ చేస్తూ.. డబ్బు సంపాదన కోసం వీళ్లు ఏమి చేశారు .. ఈ ప్రాసెస్ లో తమన్నా, మెహరీన్ వీరికి ఎలాంటి సమస్యలు సృష్టించారు .. ఈ మధ్యలో సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ఏమిటో తెలియాలంటే ఎఫ్3 చిత్రాన్ని చూడాల్సిందే.
విశ్లేషణ ..దర్శకుడు అనిల్ రావిపూడి డిఫరెంట్ క్యారెక్టర్స్ .. క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించారనే చెప్పాలి. అలాగే క్వాలిటీ ఫన్ తో ఫుల్ గా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాల్లో వచ్చే సీన్స్ లో అయితే, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశాడు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెంకీ -వరుణ్ ల లోపాలను కూడా చాలా ఫన్నీగా ఎలివేట్ చేశాడు. హీరోలు కూడా, ముఖ్యంగా వెంకటేష్ ‘వెంకీ పాత్ర’లో లీనం అయిపోయాడు..మొత్తానికి వెంకీ తన మార్క్ ను చూపించాడు.. వరుణ్ తేజ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి రైటింగ్ టేబుల్ దగ్గరే స్క్రిప్ట్ ను బలంగా రాసుకున్నాడు. అదే స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు. డబ్బు కోసం ఇద్దరు ఫ్యామిలీ మ్యాన్స్ పడే ఇబ్బందుల పరిణామ క్రమాన్ని కూడా చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలో పాత్రలు, వాటి పరిచయం, కొన్ని కీలక సన్నివేశాలు సరదాగా సాగుతూ..సినిమాకు హైలెట్ అయ్యింది.కథ కొంచెం కొత్తగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా అనిల్ రావిపూడి ప్రేక్షకులని నవ్వించడంలో మరోసారి సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.