హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్కడి అమెరికా ఎంబసీ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యార్థి వీ సాల జారీకి అమెరికన్ కాన్సులేట్ జనరల్ అధికారులు రెండు రోజుల వ్యవధిలో రెండు దఫాలు స్లాట్లు- విడుదల చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే అవి భర్తీ కావడం గమనార్హం. దేశంలో ఉన్న ఐదు అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూల కోసం రెండు సోమ, మంగళవారాల్లో అపాయింట్‌మెంట్ తేదీలను విడుదల చేయగా హైదరాబాద్, ఢిల్లీ కార్యాల యాల్లో స్లాట్లన్నీ నిండిపోయాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా ఎంబసీలలో కొన్ని స్లాట్లు- అందుబాటు-లో ఉండడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అక్కడికి పరుగులు పెట్టినట్టు- సమాచారం. వీసా జారీకి సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు ఏర్పా-టైన కన్సల్టెన్సీలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు- ప్రచారం జరుగుతోంది. ఒక్కో కన్సల్టెన్సీ ముప్పై నుంచి నలభై మంది విద్యార్థుల పేర్లతో స్లాట్లను బ్లాక్ చేసి తద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను జేబులో వేసు కుంటు-న్నట్టు- సమాచారం. వీసాకు సంబంధించిన ప త్రాలను ఇతరత్రా అంశాలను చూసుకునేందుకు ఒక్కో విద్యార్థి నుంచి పెద్ద మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 2020 సంవత్సరం నుంచి 2022 వరకు వీసాల జారీ మందగించినా గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల తాకిడి పెరిగిందని కాన్సులేట్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడాది వ్యవధిలో 70 వేల మంది విద్యార్థులు ఎంఎస్‌తో పాటు- ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు అమెరికా వెళ్లినట్టు- గణాంకాలు చెబుతున్నాయి.
మాస్టర్స్‌పై పెరుగుతున్న క్రేజ్
తెలుగు విద్యార్థులు నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేశాక అమెరికా వెళ్లి మాస్టర్స్ చదవాలన్న కోరిక తెలుగు విద్యార్థుల్లో గణనీయంగా పెరిగుతోంది. ఏటా లక్ష మంది విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటు-ండగా 70 నుంచి 80 వేల మందికి అమెరికా వెళ్లే అవకాశం దక్కుతోంది. వీసా జారీ కోసం దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలలో ఉన్న ఎంబసీ కార్యాల యాలు వీసాలను జారీ చేస్తాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుండడమే పోటీకి కారణమని చెబుతున్నారు. పేద, మధ్య తరగతి కుటు-ంబాలు సైతం తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న సంకల్పంతో బ్యాంకుల ద్వారా విద్యా రుణాలు పొందడమో లేక ఇళ్ళు, పంట పొలాలు, వ్యవసాయ భూమిలో కొంత అమ్మి ఆ మొత్తంతో తమ పిల్లలను విదేశాలకు పంపిస్తున్నట్టు- చెబుతున్నారు.
ఒకప్పుడు సంపన్న, అగ్రశ్రేణి కుటు-ంబాల పిల్లలే ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వెళ్లేవారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఇంజరింగ్ కళాశాలల సంఖ్య పెద్ద ఎత్తున ఏర్పాటు- కావడం ఇన్ఫర్మేషన్ -టె-క్నాలజీ (ఐటీ-) రంగం కొత్త పుంతలు తొక్కడంతో ఉపాధి అవకాశాలు మెండుగా అందుబా టు-లోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా విదేశీ విద్యకు వెళ్లే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బ్రాహ్మణ, ఇతర సామజిక వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేస్తుండడం కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థులు పెరగటానికి కారణమని విశ్లేషిస్తున్నారు.