Saturday, November 23, 2024

పిల్లలు, పెద్దలు మీ స్క్రీన్ టైమ్ ని తగ్గించుకోవడం మంచిది..

మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే వర్క్ చేయడం, ఆన్లైన్ క్లాసులు వంటి వాటి వల్ల మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, టాబ్లెట్స్ వంటివి పిల్లలు, పెద్దలు కూడా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. రోజులో చాలా సేపు వాటి ముందే కూర్చుంటున్నారు. ఈ బ్లూ లైట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అయితే వీటి కారణంగా మయోపియా ఎక్కువై పోయింది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తోందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. 12 వేలమంది చైనీస్ పాఠశాల విద్యార్థుల్లో మయోపియా లాక్ డౌన్ సమయం లో వచ్చింది అని తేలింది. నిజంగా పిల్లల్లో ఈ సమస్య వస్తే చాలా కష్టం. ఇలా ఈ సమస్య ఉండటం వల్ల మరి కొన్ని సమస్యలు కి కూడా దారి తీస్తుంది. వయసు పెరిగే కొద్దీ కళ్ళు కూడా కనపడవు అని నిపుణులు చెబుతున్నారు. Brien Holden Vision Institute ప్రకారం చదువు బాగున్న సరే పిల్లల ఆరోగ్యం బాగోలేదు. ముఖ్యంగా కంటి సమస్యలు ఎక్కువైపోయాయి అని అంటున్నారు.

స్మార్ట్ ఫోన్స్, లాప్టాప్స్, టాబ్లెట్స్ వాటి ముందు పిల్లలు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పారు నిపుణులు చెబుతున్నారు. దీని వలన వచ్చే బ్లు లైట్ వల్ల నిద్ర కూడా సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు బ్లూ లైట్ వల్ల నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. సరిగ్గా కనబడకపోవడం, నిద్ర లేకపోవడం వంటి సమస్యలు దారి తీస్తాయని చెబుతున్నారు. నిద్ర పోయే దానికి రెండు గంటల ముందు డివైస్ ని ఆఫ్ చేసి ఆ తర్వాత నిద్ర పోవడం మంచిది. కంటికి సరైన రెస్ట్ ఉండాలి. పిల్లలు, పెద్దలు కూడా స్క్రీన్ ముందు సమయాన్ని తగ్గించుకోవడం మంచిది.

నాలుగేళ్ల నుండి ఆరేళ్ల పిల్లలు రోజుకి కనీసం అరగంట సేపు మాత్రమే స్క్రీన్ ముందు ఉండొచ్చని అరగంట కంటే ఎక్కువ వీటి ముందు ఉండకూడదు అని చెప్పారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళు సెల్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో గంట కంటే ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు అని అన్నారు. పిల్లలు అలాగే పెద్ద వాళ్లు కూడా వీటికి దూరంగా ఉంటేనే మంచిది అంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు మీ స్క్రీన్ టైమ్ ని గమనించి తగ్గించుకోవడం మంచిది లేదా ఎన్నో సమస్యలు వస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement