వరంగల్ : పేదలకి ఏది అవసరమో దాని పైన మన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడతారని, కంటి సమస్యలతో నేడు ఎన్నో బాధలు పడుతున్న నిరుపేదలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడద్దని మన ముఖ్య మంత్రి ఆశయంగా పెట్టుకున్నారన్నారు. ఒక రాయపర్తిలోనే 26 రోజులు కంటి పరీక్షలు చేస్తారని, 800 అద్దాలు ఇప్పటికే వచ్చాయన్నారు. ఇంకా అవసరమైనావి ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే 10 రోజుల్లో వస్తాయన్నారు. కంటి వెలుగులో పరీక్షలు చేసే డాక్టర్ లకు మంచి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మంచి పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నేడు చిన్న పిల్లల దగ్గర నుండి కంటి సమస్యలు వస్తున్నాయన్నారు. బిడ్డల పెళ్లిళ్ల కోసం, కాన్పు కోసం కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ద్వారా పేద తల్లిదండ్రుల కష్టాలను తీరుస్తున్న మహానుభావుడు మన కేసీఆర్ అన్నారు. ఎదురు పెట్టుబడి పెట్టి రైతు బంధు ద్వారా రైతులను ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రిదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 75 ఏండ్లు నీళ్ల కోసం కొట్లాట పడిన రోజులు, బిందెలు పట్టుకొని రోడ్ ల మీదకు వచ్చి ఇబ్బందులు పడ్డ రోజులు పోయాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement