Tuesday, November 26, 2024

అదనపు ల‌గేజీ పై అద‌న‌పు చార్జ్… రైల్వే శాఖ నోటిఫికేష‌న్

విమాన ప్రయాణికులు ఎక్స్‌ట్రా లగేజీని తీసుకువెళ్లాలంటే దానికి ప్రత్యేక చార్జ్ చెల్లించాలి. ‘ఫ్రీ అలవెన్స్‌’ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణించే వారు ప్రత్యేకంగా చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది… అయితే ఇప్పుడు రైల్వే శాఖ కూడా అవే నియమాలను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. రైళ్ల‌లో ప్రయాణించే వారు కూడా ఫ్రీ అలవెన్స్ పరిధిని దాటి అదనపు లగేజీతో ప్రయాణిస్తే ఈ నిబంధనను పాటించాల్సిందే అని రైల్వేశాఖ తాజాగా పేర్కొంది. టికెట్‌ తీసుకోకుండా ఎక్స్‌ట్రా లగేజీతో అక్రమంగా ప్రయాణాలు సాగించే వారికి భారీ జరిమానా విధించనున్నట్టు వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement