భీమవరం, ప్రభన్యూస్ ప్రతినిధి : పశ్చిమ గోదావరి జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల ధన దాహానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. విద్యను పలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వ్యాపారంగా మార్చేయడంతో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడం, పాఠశాలల్లోనే ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేసి డ్రెస్సులు, పుస్తకాలు, ఇతర విద్యాసామాగ్రి, షూ మ్లార్టను నడుపుతు న్నారు. ఈ విద్యా వ్యాపార సంస్థలు తాము నిర్ణయించిన ధరకే విద్యార్థుల తల్లి దండ్రులచే అధిక ధరలకు కొనుగోలు చేయిస్తున్నారు.
పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్, టై, షూ, సాక్స్, అంటూ వేలాది రూపాయిలు దండుకుంటున్నారు. మరో వైపు అధిక ఫీజులు వసూళ్లు, నిబంధనలకు విరు ద్ధంగా జరుగుతున్నా విద్యాశాఖధికారులు తూతూ మంత్రం చర్యలతో సరిపెడుతున్నారు. విద్యాసంస్థలలో విద్యాసామాగ్రీ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ వెంకటరమణ హెచ్చరిస్తున్న ఇవేమీ తమకు పట్టవు అన్నట్లు పలు కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయి.
విద్యార్థి సంఘాలు ఆందోళన..
ఇటీవల భీమవరం కుముదవల్లి రోడ్డులోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం పుస్తకాలు, యూని ఫామ్ విక్రయాలు, అధిక ఫీజులు వసూలు చేస్తు న్నారని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. డివైఇవో శ్రీరామ్, ఎంఇవో వెంకటేశ్వర రావు అక్కడకు చేరుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి వాసు, పట్టణ కార్యదర్శి టి. ప్రసాద్ తమ ఆరోపణలకు సాక్ష్యాలను అధికారులకు అందించారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులను దొచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కఠిన చర్యలు తీసుకోకుండా నోటీసులతో సరిపెడుతున్నారని ఆ తర్వాత ఆ విషయం మరుగునపెడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులలో భీమవరం మూడు పాఠశాలలు అధికారులు తనిఖీలు నిర్వహించి సంబంధిత పాఠశాలకు నోటీసులు జారీ చేశారు. నరసాపురం, తణుకు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో కూడా పాఠశాలను తనిఖీ చేసి అక్కడ అనధికారిక విక్రయాలు సాగుతున్నాయని అధికారులు గుర్తించారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తున్న సమయంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు . విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతోని ఇటు-వంటి సంఘటనలు యదేచ్ఛగా పాఠశాలలో కొనసాగుతున్నాయని అంటున్నారు.
నారాయణలో పుస్తకాల గది సీజ్ ..
భీమవరంలోని నారాయణ టెక్నో స్కూల్లో పుస్తకాలు విద్యాసామాగ్రి పేరిట అనాధ గారికి విక్రయాలు చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శనివారం ఆందోళన నిర్వహించారు. జిల్లా ఉప విద్య శాఖ అధికారికి తెలియజేయగా వచ్చి పుస్తకాలు అమ్ముతున్న గదిని పరిశీలించారు. అనంతరం ఆ గదిని సీజ్ చేసి యాజమాన్యం కి శాఖ పరమైన నోటీస్ లు ఇచ్చారు. విద్యార్థి సంఘాలు నాయకులు వచ్చి సమస్యను, దోపిడీని గుర్తించిన తర్వాతే అధికారులు వచ్చి తూతూ మంత్రపు చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు యూ. వినోద్, బి. గణేష్,ఎం.శివ,జి. శ్రీను,టి. చిరంజీవి,కె. నాని తదితరులు మండిపడుతున్నారు
8 స్కూళ్లపై చర్యలు
జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్లో తనిఖీలు నిర్వహించి. ఎక్కడైనా విద్యా సామాగ్రీ గుర్తిస్తే చర్యలు తీసుకుం టామన్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాలో అనధికారికంగా పుస్తకాలు విద్యాసామాగ్రిస్తున్న ఎనిమిది స్కూల్స్ పై చర్యలు తీసుకున్నామని తెలిపారు . ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.