Friday, November 22, 2024

విస్తృతంగా అటవీ వ్యవసాయంలో పరిశోధనలు.. యూనివర్సిటీల ఒప్పందం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అటవీ వ్యవసాయంలో పరిశోధనలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ మేరకు దూలపల్లిలోని అటవీ, సహజ వనరుల నిర్వహణ అధ్యయన కేంద్రం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అటవీ వ్యవసాయం, జీవవైవిద్య సంరక్షణపై కలిసి పని చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది.

వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ర్‌ డాక్టర్‌ ఎం.వెంకటరమణ, అటవీ అకాడమీ సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.జె.ఆశా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు, రైతులకు, అటవీ వ్యవసాయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒప్పందం తోడ్పడుతుందన్నారు.

యూనివర్సిటీ అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్‌ జమునారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, అటవీ వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement