Friday, November 22, 2024

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ విస్తృతం.. ఆరువేల టవర్లు అందుబాటులోకి

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) 4జీ నెట్‌వర్క్‌ పరిధి విస్తృతం కానుంది.దీనిపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 6,000టవర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి అవసరమైన కాంట్రాక్ట్‌ను దేశీయ సాప్ట్‌nవేర్‌ దిగ్గజం టీసీఎస్‌ సారథ్యంలోని కన్సార్టియానికి అప్పగించింది.ఈ ప్రాజెక్ట్‌ విలువ 550 కోట్ల రూపాయలు. ఈ కాంట్రాక్ట్‌ ప్రతిపాదనలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, సంబంధిత కన్సార్టియం ప్రతినిధులు సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం నెలకొల్పదలిచిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ టవర్ల సంఖ్య లక్షా12 వేలుకాగా వీటిలో 6,000 టవర్లకు చెందిన ప్యాకేజీని టీసీఎస్‌ సారథ్యంలోని కన్సార్టియం దక్కించుకుంది. దశలవారీగా ఈ మొబైల్‌ టవర్లను నెలకొల్పుతుంది ఈ కన్సార్టియం. ఎంత కాలవ్యవధిలో వాటిని ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌ నిబంధనల్లో పొందుపరిచింది. ఆయా టవర్లను నిర్మించిన అనంతరం నిర్ణీతకాలం వరకు వాటిని ఈ కన్సార్టియమే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించినట్లు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా లక్షా12వేల మొబైల్‌ టవర్లను నిర్మించనున్నారు. కేంద్రం దీనికి సంబంధించిన కాంట్రాక్ట్‌ ప్యాకేజీలను సైతం వేర్వేరుగా జారీ చేయనుంది. ఇప్పటికే 6,000 టవర్లతో కూడిన ప్యాకేజీ కాంట్రాక్ట్‌ను టీసీఎస్‌ కన్సార్టియానికి అప్పగించింది.దీనికి సమాంతరంగా 5జీ నెట్‌వర్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఈ విషయాన్ని ఇటీవలే టెలికం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పార్లమెంట్‌లో ప్రకటించారు. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నామని స్పష్టం చేశారు.తొలివిడతలో 4జీ నెట్‌వర్క్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement