Sunday, November 17, 2024

TS : 23 వరకు కవిత రిమాండ్ పొడిగింపు

లిక్కర్‌ స్కాం విచారణలో భాగంగా కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీని విధించింది రౌస్‌ ఎవెన్యూ కోర్టు. ఇవాళ్టితో ఆమె సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఈ కేసును మరింత విచారించాల్సి ఉందని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కవితకు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరారు. అయితే న్యాయస్థానం 9 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో కవిత మరోసారి తిహాడ్ జైలుకు వెళ్లనున్నారు.

మరోవైపు కవితను కలిసేందుకు ఆదివారం రోజున ఆమె సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన భర్త అనిల్ దిల్లీ వెళ్లారు. ఆదివారం సాయంత్రం సమయంలో కవితను కలిసి ఆ ఇద్దరూ మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement