హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఇంటర్ బోర్డు అధికారులు పొడిగించారు. ఈనెల 19వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈనెల 9వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని బోర్డు ఇప్పటికే ప్రకటించింది.
అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 16వ తేదీ వరకు కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. మంగళవారంతో ఆ గడువు ముగియడంతో కళాశాల యాజమాన్యాలు, విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 19 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.