ఆర్థిక సంవత్సరం 2020-21కి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నులు దాఖలు చేయాల్సిన వ్యాపార కంపెనీలకు కేంద్ర ప్రభుతం ఉపశమనం కల్పించింది. జీఎస్టీఆర్ దాఖలు గడువును డిసెంబర్ 31, 2021 నుంచి ఫిబ్రవరి 28, 2022 వరకు పెంచింది. రెండు నెలలపాటు గడువును పెంచినట్టయింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ ప్రకటన చేసింది. ఫామ్ జీఎస్టీఆర్-9, ఫామ్ జీఎస్టీఆర్-9సీలో సెల్ఫ్ సర్టిఫైడ్ రికన్సాలియేషన్ స్టేట్‌మెంట్ వార్షిక గడువును డిసెంబర్ 31, 2021 నుంచి 28 ఫిబ్రవరి 2022 వరకు పెంచుతున్నట్టు ట్వీట్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital