Tuesday, November 26, 2024

ఉచిత విద్య ప్రవేశాల గడువు పెంపు..

అమరావతి,ఆంధ్రప్రభ: ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్‌12(1) (ఈ) అనుసరించి 2023-2024 విద్యా సంవత్సరం నకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు 1వ తరగతిలో ఎంపికైన విద్యార్థులు బడిలో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు పాఠశాల విద్య కమీషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 28తోనే ముగియనున్న ప్రవేశాలకు విద్యార్థులు సౌకర్యార్థం మరో రెండు రోజులు గడువు పెంచినట్లు, విద్యార్థులు సద్వినియోగ పరచుకునేలా తల్లిదండ్రులకు అవగాహన పరచాలని ఆర్జేడీలకు, డీఈవోలకు కమీషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement