Friday, November 22, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు : మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, మార్చి 25: 2023-24 విద్యా సంవత్సరానికిగాను డా.బీఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గతంలో ఇచ్చిన గడువును ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 ఎస్సీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ గడువు మార్చి 24వ తేదీ తో ముగిసిపోగా దీన్ని మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నామని వివరించారు. ఆన్‌ లైన్‌ ద్వారా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు.

ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలోకి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు అర్హులని చెప్పారు. 5 వ తరగతిలోకి ప్రవేశం కోరే విద్యార్థులు https:/apgpcet.apcfss.in అనే వెబ్‌ సైట్‌ ద్వారా, అలాగే ఇంటర్‌ లో ప్రవేశం కోరే విద్యార్థులు https:/apgpcet.apcfss.in. /nter అనే వెబ్‌ సైట్‌ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 31వ తేదీ లోపుగా సమర్పించాలని నాగార్జున కోరారు. గురుకుల సీట్ల కేటాయింపులో ఎస్సీ ఎస్సీలకు 75 శాతం, బీసీ-సీ కేటగిరీకి చెందిన క్రిస్టియన్‌ దళితులకు 12శాతం, ఎసటీలకు 7శాతం, బీసీలకు 6 శాతం, ఓసీలకు 2శాతం రిజర్వేషన్లప్రకారంగా కేటాయించడం జరుగుతుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement