Friday, November 22, 2024

20.55 శాతం పెరిగిన ఎగుమతులు.. వాణిజ్యలోటు 24.29 బిలియన్‌ డాలర్లు..

మన దేశ వాణిజ్య ఎగుమతులు మే నెలలో 20.55 శాతం పెరుగుదలతో 38.94 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్యలోటు 24.29 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు బుధవారం నాడు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్‌, మే నెలలో ఎగుమతులు 78.72 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు 123.41 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఫలితంగా వాణిజ్యలోటు ఈ రెండు నెలల్లో 44.69 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 21.82 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మే నెలలో పెట్రోలియం, క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులు 102.72 శాతం పెరిగి 19.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

బోగ్గు, కోక్‌ దిగుమతులు 5.5 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 2021లో వీటి దిగుమతులు 2 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. బంగారం దిగుమతులు 6 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2021 మే నెలలో 677 మిలియన్‌ డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి ఇంజనీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతులు 12.65 శాతం పెరిగి, 9.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. నగలు, వజ్రాల ఎగుమతులు 3.22 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. గత సంవత్సరం వీటి ఎగుమతులు 2,96 బిలియన్‌ డాలర్లు. కెమికల్స్‌ ఎగుమతులు 17.35 శాతం పెరిగి 2.5బిలియన్‌ డాలర్లుగా నిలిచాయి. ఇనుప ఖనిజం, జీడిపప్పులు, హ్యాండీ క్రాప్ట్స్‌ , ప్లాస్టిక్‌, కార్పెట్స్‌, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement