మన దేశం నుంచి ఎగుమతులు డిసెంబర్‌లో 12.2 శాతం తగ్గి, 34.48 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 39.27 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే కాలం మన దేశ దిగుమతులు 60.33 బిలియన్ డాలర్ల నుంచి 58.44 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా డిసెంబర్‌లో వాణిజ్య లోటు 23.89 బిలియన్ డాలర్లకు చేరింది. గత సంవత్సరం ఇది 21.10 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 నవంబర్‌తో పోలిస్తే మాత్రం డిసెంబర్ వాణిజ్య లోటు దాదాపు సమానంగా ఉంది.
ఆ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య దేశ మొత్తం ఎగుమతుల విలువ 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత ఎగుమతులు మాత్రం పెరిగాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్ధ్‌వాల్ తెలిపారు.