Monday, January 6, 2025

Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు .. ఆరుగురు మృతి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, చెన్నై : తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా సత్తూరు స‌మీపాన ఉన్న‌ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడులో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మ‌రో ఏడుగురు గాయ‌ప‌డ్డారు. పేలుడు ధాటికి ఆరు ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ప్ర‌మాద వార్త తెలిసిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని శిథిలాల్లో చిక్క‌కున్న ఒక‌రిని ర‌క్షించారు. అయితే ఆయ‌న కూడా చికిత్స పొందుతూ ఆస్ప‌త్రిలో మృతి చెందాడు.

నాలుగు గదులు నేల‌మ‌ట్టం
స‌త్తూరు స‌మీపాన ఉన్న అప్పయ్య నాయకన్‌పట్టిలోని సాయినాథ్‌ అనే ప్రైవేట్‌ పటాసులు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ సమయంలో షార్ట్ సర్క్యూట్ తో పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి నాలుగు గ‌దులు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. అందులో ప‌నిచేస్తున్న కార్మికులు ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. శిథిలాల్లో చిక్కున్న ఓ వ్య‌క్తిని అగ్నిమాప‌క సిబ్బంది ర‌క్షించి ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

- Advertisement -

బాణ‌సంచాలో భ‌ద్ర‌తా లోపాలు
ఈ సంఘటనతో విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారాల్లో భద్రతా లోపాలు ఉన్నాయ‌ని మ‌రోసారి వెల్ల‌డైంది. గత ఏడాది సత్తూరులోని బాణాసంచా తయారీ ప్లాంట్‌లో భద్రతా నిబంధనలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనిఖీ చేసినప్పటికీ.. వరుస ప్రమాదాలు కొనసాగుతునే ఉన్నాయి. సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను అమలు చేయడంతో పాటు బాణసంచా పరిశ్రమను సమర్థవంతంగా నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement