మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని పేలుడు పదార్థాల తయారీ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు.