Friday, November 22, 2024

హనుమంతుడు పుట్టింది తిరుమలలోనే: టీటీడీ

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండ ఇకపై హనుమంతుడి జన్మస్థలంగానూ గుర్తింపు పొందనుంది. హనుమంతుని జన్మస్థానం తిరుమల క్షేత్రమే అని శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సిద్ధమైంది. ఉగాది రోజున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని, అన్ని ఆధారాలతో త్వరలో పుస్తకాన్ని తీసుకొస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని అంజనాద్రి కొండలో ఆంజనేయుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు 2020లో టీటీడీ పండితులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ మురళీధర శర్మ, రాణి సదాశివమూర్తి, జానమద్ది రామకృష్ణ, శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement