Friday, November 22, 2024

ఖరీదైన నివాస నగరాలు న్యూయార్క్‌, సింగపూర్‌

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసిత నగరాలుగా న్యూయార్క్‌, సింగపూర్‌ నిలిచాయి. ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ రూపొందించిన వరల్డ్‌వైడ్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రిపోర్ట్‌ ప్రకారం, ప్రపంచంలోని 172 ప్రధాన నగరాల్లో జీవన వ్యయం గత సంవత్సరంలో సగటున 8.1శాతం పెరిగింది. ఉక్రెయిన్‌లో యుద్ధం, సరఫరా-గొలుసు ధ్వంసం ఇందుకు ప్రధాన కారణం. గత ఏడాది ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టెల్‌ అవీవ్‌ మూడో స్థానానికి పడిపోగా, హాంకాంగ్‌, లాస్‌ ఏంజెల్స్‌ టాప్‌-5 ర్యాంకుల్లోకి చేరుకున్నాయి. ప్రభుత్వ విధానాలు, కరెన్సీ కదలికల కారణంగా దేశ వ్యక్తిగత పనితీరు మారుతూ ఉన్నప్పటికీ, ఆసియా నగరాలు ధరల పెరుగుదల నుండి తప్పించుకోగలిగాయి. ఈ ప్రాంతంలో జీవన వ్యయంలో సగటు పెరుగుదల 4.5శాతంగా నమోదైంది.

అధ్యయనంలోని కీలక అంశాలు..

  • వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో టోక్యో, ఒసాకా వరుసగా 24, 33 స్థానాలకు పడిపోయాయి.
  • సిరియా రాజధాని డమాస్కస్‌, లిబియాలోని ట్రిపోలీ ప్రపంచంలోనే అత్యంత చౌకైన ప్రదేశాలు.
  • బలమైన ఎగుమతులు ఆస్ట్రేలియా డాలర్‌ను బలోపేతం చేయడంతో సిడ్నీ టాప్‌ 10లోకి దూసుకెళ్లింది
  • శాన్‌ ఫ్రాన్సిస్కో గతేడాది 24వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఎనిమిదో స్థానానికి చేరుకుంది.
  • ఆరు అత్యంత ఖరీదైన చైనీస్‌ నగరాలు మరింత పతనం అయ్యాయి. షాంఘై టాప్‌ 20లోకి ప్రవేశించింది. – ఈ ఏడాది ఆగస్టు- సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లో 200కి పైగా ఉత్పత్తులు, సేవలలో 400 కంటే ఎక్కువ వ్యక్తిగత ధరలను పోల్చిచూశారు.

టాప్‌ 10 ర్యాంకుల్లోని నగరాలు

1) సింగపూర్‌ , 1) న్యూయార్క్‌ , 3) టెల్‌ అవీవ్‌ , 4) హాంకాంగ్‌ , 4) లాస్‌ ఏంజిల్స్‌ , 6) జ్యూరిచ్‌ , 7) జెనీవా , 8) శాన్‌ ఫ్రాన్సిస్కో ,9) పారిస్‌ ,10) కోపెన్‌హాగన్‌ , 10) సిడ్నీ

Advertisement

తాజా వార్తలు

Advertisement