Tuesday, November 26, 2024

అంచ‌నాలు పెంచుతున్న‌ న‌థింగ్ ఫోన్‌-2.. జులైలో మార్కెట్లోకి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్, తమ సరికొత్త నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ ని జులై 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్, డిజైన్ వంటి ప‌లు అంశాలు ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో చక్కర్లు కొడుతున్నాయి. లండన్ కి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ వ‌చ్చే నెల‌లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. నథింగ్ ఫోన్ 2 లాంచ్ ఈవెంట్ భార‌త్‌లో జులై 11 రాత్రి 8:30 గంటలను ప్రారంభంకానుంది. ఇది తమ మునుపటి స్మార్ట్ ఫోన్ అయిన నథింగ్ ఫోన్ 1 కి అడ్వాన్స్డ్ మోడల్ గా రానున్న‌ట్టు తెలుస్తోంది.

నథింగ్ ఫోన్ 1 మాదిరిగా నథింగ్ ఫోన్ 2 కూడా ట్రాన్స్పరెంట్ డిజైన్ ను కలిగి ఉంటుందని, ఫోన్ వెనుకవైపు నథింగ్ ఫోన్ 1 కంటే ఎక్కువ ఎల్ఈడీలు ఉండనున్నాయని టెక్ అన‌లిస్టులు చెబుతున్నారు. అలాగే ఈ ఫోన్ ను మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేయడానికి కెమెరా చుట్టూ ఎల్ఈడీ లైట్స్ ను అమర్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుందని, ఇది వైట్, బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంటుందని ప‌లు నివేదికలు తెలిపాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ సుమారు రూ. 40,000 ధరలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.

టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నాల‌ ప్రకారం నథింగ్ ఫోన్ 2 లో ఉండే ఫీచర్స్ :

- Advertisement -
  • 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే
  • 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్
  • 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్
  • 5జీ సపోర్ట్
  • వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్
  • ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • ఆన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సెర్
  • యూఎస్బీ టైపు-సీ పోర్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement