Friday, November 22, 2024

తెలంగాణలో బిగ్‌బాస్కెట్‌ విస్తరణ

నిజామాబాద్‌/ కరీంనగర్‌: టాటా గ్రూప్‌నకు చెందిన బిగ్‌బాస్కెట్‌ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బిగ్‌బాస్కెట్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండగా, తాజాగా వరంగల్‌, కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌ నగరాల్లోనూ సేవలు ప్రారంభించింది. బిగ్‌బాస్కెట్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు తమకు కావల్సిన నిత్యావసర వస్తువులను ఆర్డర్‌ చేసుకుని, నేరుగా ఇంటికే తెప్పించుకునే అవకాశం లభించింది.

వేగవంతంగా వస్తుసామగ్రిని డెలివరీ చేయడంతోపాటు ఆ వస్తువుల భద్రతకు భరోసా కల్పిస్తున్నట్లు బిగ్‌బాస్కెట్‌కు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4వందలకు పైగా నగరాలు, పట్టణాల్లో బిగ్‌బాస్కెట్‌ సేవలు అందిస్తోందని ఆ సంస్థ బిజినెస్‌ హెడ్‌ హర్ష జెట్టి ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement