దేశం మొత్తం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఏడు దశల ఎన్నికలు ముగియడంతో.. ఏ పార్టీకి, ఏ కూటమికి ఎన్నెన్ని సీట్లు దక్కుతాయన్న విషయంపై ఆయా సంస్థలు అంచనాలను ప్రకటించాయి.
పలు మీడియా, ఏజెన్సీలు పోలింగ్ సమయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని వీటిని విడుదల చేస్తాయి. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీకే అన్ని సర్వే సంస్థలు పట్టం గట్టాయి. 350 స్థానాలకు పైగా ఎన్ డి ఎ కూటమి విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. ఇండియా కూటమి 140 నుంచి 155 స్థానాలకు పరిమితం అన్ని జాతీయ చానల్స్ పేర్కొన్నాయి.
ఇండియా న్యూస్ డీ డైనమిక్స్‌ఎన్‌డీఏ – 371ఇండియా కూటమి – 125ఇతరులు – 47
రిపబ్లిక్ భారత్-మాట్రిజ్‌ఎన్డీఏ – 353-368ఇండియా కూటమి – 118-133ఇతరులు – 43-48
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్‌ఎన్డీఏ – 359ఇండియా కూటమి – 154ఇతరులు – 30
జన్‌కీ బాత్‌ఎన్డీఏ – 377ఇండియా – 151ఇతరులు – 15
న్యూస్ నేషన్‌ఎన్డీఏ – 342-378ఇండియా కూటమి – 153-169ఇతరులు – 21-23
దైనిక్ భాస్కర్‌ఎన్‌డీఏ – 281-350ఇండియా కూటమి – 145-201ఇతరులు – 33-49