డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంపై ఆర్బీఐ జారీ చేసిన సూచనలు, నిబంధనల అమలును మరో మూడు నెలల పాటు వాయిదా వేశారు. ఈ మేరకు ఆర్బీఐ అన్ని బ్యాంక్‌లకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు సమాచారం అందించింది. ఈ నిబంధనలు, మార్పులు జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. వీటి అమలుకు మరింత గడువు కావాలని బ్యాంక్‌లు, సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువును అక్టోబర్ 1, 2022కు పెంచినట్లు తెలిపింది. ముఖ్యంగా జారీ చేసిన క్రెడిట్ కార్డులను యాక్టివేట్ చేసేందుకు ఆ కార్డు పొందిన వినియోగదారుడి ఆమోదం తప్పనిసరి చేసింది ఆర్బీఐ. ఓటీపీ ద్వారా కస్టమర్ ఆమోదం లభించిన తరువాతే దీన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.
కార్డు జారీ చేసిన తరువాత కనీసం 7 పనిదినాల్లోగా ఈ విధంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడు దీనిపై 30 రోజుల వరకు స్పందించకుంటే, ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండానే కార్డు అకౌంట్‌ను మూసివేయాల్సి ఉంటుంది. కార్డు జారీ చేసిన తరువాత క్రెటిట్ పరిధితో పాటు ఇతర అంశాలను వివరించాల్సి ఉంటుంది. కార్డుదారు అనుమతిలేకుంటా ఇందులో ఎలాంటి మార్పులు చేయడానికి వీలులేదు. కార్డుదారులు చెల్లించని ఛార్జీలు, లేవీలు, పన్నులు ఏమైన్న వాటిపై ఎలాంటి వడ్డీని మూడు నెలల పాటు వసూలు చేయవద్దని కూడా ఆర్బీఐ ఆదేశించింది. మాస్టర్ కార్డు డైరెక్షన్ పేరుతో గతంలో జారీ చేసిన వాటిలో పైన తెలిపినవి మిన్హమిగిలిన ఆదేశాలు, మార్పులు, ఇతర అంశాలు మాత్రం జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.