విశ్వంలో ఎన్నో వందల కోట్ల గెలాక్సీలు. అందులో మన పాలపుంత (మిల్కీవే) ఒకటిమనకు అన్నింటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడాహబుల్ టెలిస్కోప్‌తో అద్భుతంగా చిత్రీకరించిన నాసా
మన విశ్వం అంటేనే ఎన్నో అద్భుతాలకు పుట్టినిల్లు. వందల కోట్ల గెలాక్సీలు, వేల కోట్ల నక్షత్రాలతో అలరారుతుంది. అలాంటి గెలాక్సీలలో మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీ వే) ఒకటి. ఇక అంతరిక్షంలో మనకు అన్నింటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా.
ఇవి రెండూ మెల్లగా ఒకదానికి మరొకటి దగ్గరగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని వందల కోట్ల ఏళ్లలో రెండు గెలాక్సీలు ఢీకొని కలసిపోతాయని అంచనా వేస్తున్నారు.
హబుల్ టెలిస్కోప్ తో…
మనకు దగ్గరగా ఉండి, భవిష్యత్తులో ఢీకొట్టబోయే ఆండ్రోమెడా గెలాక్సీపై అంతరిక్ష శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షంలో తిరుగాడుతున్న ప్రతిష్టాత్మక హబుల్ టెలిస్కోప్‌తో ఈ గెలాక్సీని పదేళ్లుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అలా చిత్రీకరించిన ఫొటోలన్నీ కలిపి అత్యంత పెద్ద చిత్రం ఒకదాన్ని తాజాగా రూపొందించారు.
ఏకంగా 250 కోట్ల పిక్సెల్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో సుమారు 20కోట్ల నక్షత్రాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఆ గెలాక్సీలో కొంత భాగం మాత్రమేనని చెబుతున్నారు.
.వీడియోగా రూపొందించిన నాసా..
ఆండ్రోమెడా గెలాక్సీకి చెందిన అతిపెద్ద చిత్రాన్ని.. దాని వివరాలతో పాటు నాసా ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను లేటెస్గుగా యూట్యూబ్‌లో పెట్టింది. ఆ వీడియోను చూసిన చాలామంది అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలాబాగుందని కామెంట్స్ చేస్తున్నారు.