న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచంలోనే సాంకేతికంగా ముందున్న చైనా సృష్టికే ప్రతి సవాల్ విసురుతోంది. అక్కడి ప్రజలెవరూ అంధ విశ్వాసాల్ని ఆచరించరు. మతాలపై పెద్దగా ఆసక్తి చూపరు. ఆ దేశంలో బౌద్దమతం విస్తరించింది. అయితే అది కొన్ని వర్గాలకే పరిమితం. చైనాలో ఎక్కువగా ఏ మతాన్ని అనుసరించని వ్యక్తులే కనిపిస్తారు. నో రిలిజియన్ అన్నది చైనీయుల ప్రగాఢ విశ్వాసం. కొందరు మాత్రం అగ్నిని ఆరాధిస్తారు. వీరి సంఖ్య కూడా చైనాలో స్వల్పమే. సృష్టి రహస్యాల్ని తమ మేథోసంపత్తితో ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న చైనాలో ప్రభుత్వాలిప్పుడు ప్రజల్ని మత విశ్వాసాలవైపు ప్రోత్సహిస్తున్నాయి. ఏదొక మతాన్ని విశ్వసించి అనుసరిస్తే మానసిక ప్రశాంతతతో పాటు అంతర్గత శాంతిసౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయంటూ ఉద్బోదిస్తున్నాయి.
కాగా పక్కనున్న భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ దేశంలో పలురకాల మతాలున్నాయి. వేల ఏళ్ళ నాటి నుంచి మతాల ఆధారంగా ఇక్కడ వ్యవస్థలు విశ్వాసాలు ఆవిర్భవించాయి. భారత్‌లోకి ఇస్లాం ప్రవేశానికి ముందే ఇక్కడు న్న హిందువుల్లో వైష్ణవులు, శైవులంటూ వేర్వేరు వర్గాలుగా ఆధిపత్య పోరాటాలు సాగించారు. ఇస్లాం ఆ తర్వాత క్రైస్తవం ప్రవేశంతో అప్పటి వరకు న్న హిందూయిజంతో పాటు బౌద్దిజం, జైనిజంల మధ్య మత దురహంకారం పెరిగాయి. ఇవి అంతర్గత విధ్వేషాలకు
దారితీస్తున్నాయి. భారత్ లౌఖిక రాజ్యంగా ఆవిర్భవించింది. ప్రభుత్వం దృష్టిలో అన్నిమతాలు సమానమే. ప్రజలు కూడా ఇక్కడ పరమత సహనాన్ని కలిగుండేవారు.
అయితే ఉగ్రవాద మూకలు మత ఆధారిత విధ్వంసాన్ని పెంచిపోషించాయి. ఇది ప్రజల మధ్య పరస్పర విశ్వాసాల్ని దెబ్బతీసింది. మతాల మధ్య ఉగ్రమూకలు చిచ్చెట్టి అంతర్గత అశాంతిని ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వాలు భారత్‌లో మతఛాం దస వాదాన్ని కఠినంగా అణిచివేయలేక పోతున్నాయి. ఈ దిశగా అవి చేస్తున్న ప్రయత్నాలు కూడా నామమాత్రమే. వందలఏళ్ళ తరబడి కమ్యూనిస్ట్ భావజాలంతో నాస్తికత్వాన్ని పెంచిపోషించిన చైనా ప్రజల మధ్య పరస్పర సౌభ్రాత ృత్వ వాతావరణ కల్పన కోసం మతాన్ని విశ్వసిస్తూ వాటి ఆచారాల్ని పాటించండంటూ ప్రజలకు నూరిపోస్తుంటే పలు మతాలకు పుట్టినిల్లయిన భారత్‌లో మాత్రం ఇప్పుడు అదే మతాల పేరిట మారణహోమాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రభుత్వాలు ఈ మతఛాందసవాదుల్ని, విద్వేషకారకుల్ని గుర్తించి కఠినంగా అణిచేయాల్సిన అవసరాన్ని ప్రజాస్వామ్యవాదులు నొక్కి చెబుతున్నారు.