తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్ సర్టిఫికెట్లో సవరణలకు ప్రత్యేక యాప్ ను పరిచయం చేశారు. రాష్ట్రంలో కరోనా నిరోధక టీకాలు వేయించుకున్న వారికి కొవిడ్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్లలోని వివరాల్లో అక్షర లోపాలున్న వాటిని సవరించేందుకు అనుమతివ్వాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించేలా అన్ని జిల్లాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆరోగ్యశాఖ డైరెక్టర్ డా.సెల్వవినాయగం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం కొవిన్ యాప్ను పరిచయం చేశారు. ఈయాప్లో పేరు, వయస్సు, గుర్తింపు కార్డు నెంబర్లు సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు 104 అనే నెంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement