భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో T20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గౌహతి బర్సపరా స్టేడియం వేదికాగా జరిగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సజీవంగా ఉంచుకుంది ఆసీస్.
కాగా, ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) మరో సారి సెంచరీతో మోత మెగించాడు. ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో35, 8 ఫోర్లు), ఆఖర్లో కెప్టెన్ మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ , అక్షర్ పటేల్ భారీగా పరుగులు సమర్పించుకుని భారత విజయావకాశాలను దెబ్బతీశారు. ఈ విజయంతో ఆసీస్ సిరీస్‌లో భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.