Friday, November 22, 2024

బడ్జెట్ లో కేటాయింపుల‌ పట్ల హర్షం

వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్స్ కిట్స్ తో గర్భిణీ స్త్రీలలో రక్త హీనత తక్కువగా ఉండటంతో పోషకాహార కిట్ లు అందించటానికి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించిన సందర్భంగా వికారాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులు మంగళవారం నగరంలోని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రతి సంవత్సరం ఒక లక్ష 25వేల మంది మహిళలు ప్రయోజనం పొందేలా పోషకాహార కిట్లు అందించే కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాను కూడా ఎంపిక చేశార‌న్నారు. గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో రక్త హీనత సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించి, ఆ లోపాన్ని నివారించటానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. బడ్జెట్ లో దీనికోసం నిధులు కేటాయింపు పై సర్వత్రా హర్షం వ్యక్తమ‌వుతుందన్నారు. వికారాబాద్ మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement