తల్లాడ, (ఆంధ్రప్రభ), ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామ సమీపంలోని ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్‌లో వద్ద ఎక్సైజ్ పోలీసులు 449 కేజీల గంజాయిని దహనం చేశారు. దాని విలువ కోటి 12 లక్షలుగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు రూ.449 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న గంజాయిని తల్లాడ మండలం నరసరావుపేట గ్రామంలో దహనం చేశారు.