Tuesday, November 26, 2024

లీకు వీరులు జైల్లో – ప‌రీక్ష‌లు ప్ర‌శాంతం : మంత్రి హరీశ్ రావు

లీకు వీరులు జైల్లో ఉండ‌డంతోనే ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్నాయ‌ని ఆర్థిక‌, వైద్య ఆరోగ్య శాఖ‌ల మంత్రి హ‌రీశ్ రావు బీజేపీపై మండిప‌డ్డారు. బీజేపీది పని తక్కువ ప్రచారం ఎక్కువ అని, అంతా డబ్బా కొట్టుకోవడం త‌ప్ప చేసిందేమీ లేద‌న్నారు. మాది చేతల ప్రభుత్వం అని, సీఎం కేసీఆర్ మాకు అదే చెబుతార‌ని.. పని చేసి ప్రజల హృదయం గెలుచుకోమంటార‌న్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తాడట ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజ్ వస్తె ఇప్పుడు కొబ్బరి కాయ కొడుతడాట.. ఒక్క మెడికల్ కాలేజీకు నాలుగేళ్ల తర్వాత కొబ్బరి కాయ కొడితే.. మేము గతేడాది ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలు కొబ్బరి కాయ కొట్టామ‌ని, ఈసారి తొమ్మిది కాలేజీల‌కు కొట్టబోతున్నామ‌న్నారు. ఈ లెక్క‌న మేము ఎంత చెప్పుకోవాలి అన్నారు. 40 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు తెలుగు దేశం వాళ్లు ఉండే ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? 60 ఏళ్లలో చేయనిది కేసీఆర్ ఎనిమిది ఏళ్లలో చేశార‌న్నారు. అల్లావుద్దీన్ ద్వీపం లేదు, కేసీఆర్ అనే అద్భుత దీపం ఉంది మన దగ్గర అన్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం కంటి వ‌లుగు అన్నారు. ప్రతిపక్షాల‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చిన పథకం కంటి వెలుగు అన్నారు. కంటి వెలుగును ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement