Tuesday, November 19, 2024

TS: ప‌రీక్ష పెయిల్… ఎనిమిది మంది విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య‌…

ఇంట‌ర్ ఫలితాల ఎఫెక్ట్..
ఫెయిల్ కావ‌డంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు
మ‌రణించిన వారిలో ఏడుగురు బాలిక‌లు
ఒక బాలుడు..

హైద‌రాబాద్ – ఇంటర్ ఫలితాలను బుధవారం విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఫస్టియర్ లో 60.01 శాతం, సెకండియర్ లో 64.19 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన కొందరు విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కాగా, నేటి ఉద‌యం వ‌ర‌కూ మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌కు చెందిన సాయితేజ (17), అత్తాపూర్‌కు చెందిన హరిణి, అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, దొరగారి పల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రంగారెడ్డిలో ఓ బాలిక కూడా ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

- Advertisement -

ఆత్మ‌హ‌త్య‌లొద్దు..
ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌పై అధికారులు వెంట‌నే స్పందించారు.. ఫెయిల్ అయిన విద్యార్ధుల‌కు అండ‌గా త‌ల్లిదండ్రులు ఉండాల‌ని కోరారు.. ఆత్మ‌హ‌త్య ప‌రిష్కారం కాద‌ని, స‌ప్లిమెంట‌రీల‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు. ఒక‌సారి ఫెయిల్ అయినా మ‌రోసారి త‌ప్ప‌క విజ‌యం సాధిస్తార‌ని అన్నారు.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూ క‌న్న‌వారికి క‌డుపుకోత మిగిలించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement