కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ పెట్టె ప్రశక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించేశారు. మరోవైపు అనుకున్న సమయానికే పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.కాగా ఇంటర్ విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను మాత్రం అసైన్మెంట్ రూపంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 1, 3 తేదీల్లో ఈ పరీక్షలను జరపాలని గతంలో నిర్ణయించింది.
కరోనా దృష్ట్యా కాలేజీలు మూతపడటం వల్ల విద్యార్థులు ఇంట్లోనే అసైన్మెంట్ రాసి సమర్పిస్తే సరిపోతుందని బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 7 నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా వాయిదా పడే అవకాశముందని బోర్డు పేర్కొంది.