చిల్డ్రన్ డే కేర్ సెంటర్ పై మాజీ పోలీస్ ఆఫీసర్ కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో 31మంది మృతి చెందారు. మరణించినవారిలో చిన్నారులు, పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సామూహిక కాల్పులకు పాల్పడింది ఓ మాజీ పోలీసు ఆఫీసర్ అని తేల్చారు. ఈ సంఘటన థాయిలాండ్‌లో నార్త్ఈస్ట్రన్ ప్రావిన్సులోని చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో 23 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నట్లు థాయ్ అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు అనంతరం తన భార్య, కుమారుడిని కాల్చి చంపి, తనను తాను కాల్చుకొని మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన టీచర్లలో ఒకరు 8 నెలల గర్భవతి కావడం విచారకరం. ఘటనపై థాయ్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement