ప్రధాని నరేంద్ర మోదీ కేవలం నాలుగు తరగతులు చదవడం కారణంగానే పరిపాలన అస్తవ్యస్తం చేస్తున్నడన్నారు మాజీ ఎంపీ చింతా మోహన్. తిరుపతిలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో సామాన్య మధ్య తరగతి ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపుకు మీడియాను అనుమతించక పోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికలు జగన్, చంద్రబాబు భవిష్యత్తు కోసం కాదని దేశభవిష్యత్తు నిర్ణయించేవని తెలిపారు.