Saturday, November 23, 2024

బీజేపీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

తెలంగాణ: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి బీజేపీ టికెట్ ఆశించారు. కానీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడంతో పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే సీటు దూరమైంది. దీంతో కొంతకాలంగా పెద్దిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈటెల పార్టీలో చేరడంపై, తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం కరీంనగర్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

 సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గతంలో ప్రాతినిథ్యం వహించాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు.

ఈ వార్త కూడా చదవండి: మంత్రి ఎర్రబెల్లికి స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నిరసన సెగ

Advertisement

తాజా వార్తలు

Advertisement