బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. జీవన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూకబ్జా ఆరోపణలపై చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ కేసును సవాల్ చేస్తూ, అతడిని, అతని కుటుంబ సభ్యులను అరెస్టు నుంచి మినహాయించాలని ఆయన న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తాత్కాలికంగా జీవన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయకూడదని పోలీసులును ఆదేశించింది.
అద్దె బకాయిలు రూ.2.50 కోట్ల నగదు చెల్లించకపోవడంతో ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్‌ను సీజ్ చేయడం తెలిసిందే. ఆర్టీసీ అధికారులు ఆయన షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు. ఆ బిల్లు బకాయిల ఘటన మరువక ముందే భూ కబ్జా ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు.