Friday, November 22, 2024

ఎస్‌ఐ అభ్యర్ధుల ప్రాధమిక రాతపరీక్షకు సర్వం సిద్ధం.. పకడ్భందీ ఏర్పాట్లు

అమరావతి, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 411 సివిల్‌, ఎపీఎస్‌పీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఈనెల 19వ తేదీ ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. 411 ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 1,71.936 మంది అభ్యర్ధులు ప్రాధమిక పరీక్షకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం 291 కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను అన్ని జిల్లాల్లో పకడ్భంధీ ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల ఎస్పీల స్వీయ పర్యవేక్షణలో బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాలను పోలీసుశాఖ తమ అధీనంలోకి తీసుకుంది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లోకి రానుంది.

- Advertisement -

అదేవిధంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమేరాల పర్యవేక్షణ కొనసాగనుంది. ముఖ్యం గా పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు నిర్ణీత సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా ఎట్టి పరిస్ధితుల్లో లోనికి అనుమతించరాదని పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి, స్ట్రాంగ్‌ రూంలు, భద్రత, సిసికెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ప్రాధమిక రాత పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుండి అభ్యర్ధులను తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటు-న్నందున, ఎవ్వరూ గుంపులుగా ఉండకూడదని,పరీక్షా కేంద్రాలకు దగ్గరలో జిరాక్స్‌ షాపులను మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అభ్యర్థుల సౌలభ్యం కోసం రైల్వేస్టేషన్లు, బస్టేషన్ల వద్ద ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు- చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక సిఐ స్థాయి అధికారిని బాధ్యులు నియమించారు. పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మూడు ్లపయింగ్‌ స్వ్కాడ్‌లను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్ధుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా పోలీసుశాఖ ఆధ్వర్యాన ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాలకు పోలీసుశాఖ తరుఫున ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ ఉచిత రవాణ సౌకర్యం సద్వినియోగం చేసుకోవచ్చని ఉన్నతాధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement