Friday, November 22, 2024

AP | ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అంతా రెడీ.. రేపు ఉద‌యం 8గంట‌ల నుంచి పోలింగ్‌, 16న కౌంటింగ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేపు (సోమ‌వారం) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 9 జిల్లాల పరిధిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు 13వ తేదీన‌ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని సీఈసీ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.

ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంద‌ని, ఇప్పటికే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని మీనా వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల‌లో మొత్తం 10,56,720 మంది ఓటర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. వారిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 10 లక్షల 519 మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 55,842 మంది ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 3,059 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 1,538 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఈసీ ముఖేశ్ కుమార్ మీనా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement