హైదరాబాద్, ఆంధ్రప్రభ: పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండటంతో పది పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది 2,861 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లుగా తెలిసింది. 2020లో 2,393 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 2021లో కరోనా తీవ్రత నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాదికి అదనంగా మరో 468 పరీక్ష కేంద్రాలను పెంచారు. దాంతో ఈ విద్యా సంవత్సరంలో 2,861 పరీక్ష కేంద్రాాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు.
కోవిడ్ నిబంధనలను అనుసరించే పదోతరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో పాటించిన నిబంధలను ఈ ఏడాది సైతం అమలు చేయనున్నారు. ముఖ్యంగా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించనున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష కేంద్రాల సంఖ్య భారీగా పెరిగింది. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. సెక్షన్‌కు ఒక ఉపాధ్యాయుడి చొప్పున పాఠశాలలకు టీచర్లు హాజరవుతున్నారు. ఈ సారి 6 పేపర్లకే విద్యార్థులు పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..