- 45 రోజుల పాటు ఉత్సవం..
- 40 కోట్ల మంది వస్తారని అంచనా
- భక్తుల కోసం అత్యవసర వైద్యం, ఇతర సదుపాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. కాగా, సోమవారం నుంచి 45 రోజుల పాటు మహా కుంభమేళా జరగనుంది.
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాకు ఇప్పటికే సాధువులు, అఘోరాలు ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. కుంభమేళాకు దేశవిదేశాల నుంచి 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. సామాన్యుల నుంచి దేశాధినేతలు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేసింది.
కుంభమేళాకు తరలివచ్చే భక్తుల కోసం దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. భక్తుల కోసం అత్యవసర వైద్యం, ఇతర సదుపాయాలు సమకూర్చారు.