”ఆన్ లైన్ లో విద్యార్థులకు డిజిటల్ విద్య పేరుతో కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలు దోపిడీ చేస్తున్నాయి. భౌతిక తరగతులు జరగక పోయినా లక్షల రూపాయల ఫీజులను తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నాయి. వీటిని నియంత్రిచాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూడడం మినహా వాటిపై కొరడా జుళిపించలేక పోతున్నాయి. సరైన వ్యాయామం లేక విద్యార్థులు ఇంటికే పరిమితం కావడంతో చిన్నతనం నుంచే అంధత్వ సమస్యలు తలెత్తుతున్నాయి. స్థూలకాయం వలన చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యల ను చాలా మంది చిన్నారులు ఎదుర్కొంటున్నారు…సస విద్య మానవుడి ప్రాథమిక హక్కు, ఈ విద్య ఆ దేశం యొక్క పునాదులను నిర్మిస్తుంది. ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రాథమిక పాఠశాలలో ప్రధమ ఉపాధ్యాయుడితో మొదలైన ప్రస్థానం, ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఆచార్యుల ఆశీర్వాదంతో ఎన్నో కలలతో బాహ్యప్రపంచానికి అడుగులుపెడతారు భావి పౌరులు. అలాంటి గురుశ్ఖిష్యుల అనుబంధాలను ఒక్కసారిగా తలకిందులు చేసిందీ కరోనా మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి వలన అన్నీ రంగాలలో దుర్బలత్వాలు, కఠినమైన సవాళ్లు తలెత్తాయి. అందులో ముఖ్యంగా విద్యావ్యవస్థ తీవ్ర నాటకీయ మార్పులు, ఊహంచని విధంగా ప్రీస్ఖ్కూల్ విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యపై తీవ్ర ప్రభావితం చేసింది, దీని ఫలితంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు పాఠశాలలను పూర్తిగా మూసివేశాయి. భారత దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వాల, ప్రైవేటు యాజమాన్యాల, ఎయిడెడ్, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లో సుమారు 20 లక్షల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో గరిష్టంగా ఉత్తర ప్రదేశ్ లో 2.5 లక్షలు, అత్యల్పం గా లక్షద్వీప్ లో 45 ఉన్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో 63,221 పాఠశాలలో ప్రభుత్వం పాఠశాలలు 45,013, ఎయిడెడ్ పాఠశాలలు 2346 మరియు ప్రైవేట్ పాఠశాలలు 15,862 లలో 708్ఖ0 లక్షల మంది విద్యార్థులు, విద్యార్థినులు కరోనా కారణంగా వారి విద్యను సజావుగా అభ్యసించలేక 8 వేల గంటల సమయాన్ని వధాగా కోల్పోయారు.
ఈ కరోనా కాలంలో విద్యార్థులకు విధ్యనందించాలని దక్పధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ని అనుసందిస్తూ ” ఆన్ లైన్ విద్యావ్యవస్థ” తో ప్రేకేజీ నుండి పిహచ్.డి వరకు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. కానీ మన దేశంలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించినా వాటిని పూర్తిగా ఆచరించటానికి సంసిద్దంగా లేకపోవడం గమనార్హం. దానికి కారణం భారత దేశ జనాభా సుమారుగా 140 కోట్లమంది ఉంటే, ఇందులో విద్యను అభ్యసించే వారు 8.4% మంది 04్ఖ సం?? (ప్లే స్కూల్ లో), 13.4% 51్ఖ2 సం?? (ప్రాధమిక పాఠశాల లో), 9.0% 131్ఖ7 సం?? (#హ స్కూల్ లో), 12.4% 182్ఖ4 (కాలేజ్ లో), 16.6% 253్ఖ4 సం?? (ఉన్నత విద్యాబ్యాసం), 14.3% 354్ఖ4 సం?? (పరిశోధన విద్య) ను అభ్యసిస్తున్నారు. ప్రధానంగా ఈ దేశంలో 2,50,000 గ్రామ పంచాయతీలు, 6 లక్షల గ్రామాలు కలిపి మొత్తంగా 64.1% జనాభా గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ గ్రామీణ ప్రాంతాలలో కేవలం సగం వంతు ఇంటర్నెట్ సౌకర్యాలు కలిగివుండటమే ఆ్లనన్ తరగతులకు ప్రధాన ఆటంకం. 35.9% అర్బన్ ప్రాంతం లో 10 లక్షలు కు పైగా నివసిస్తున్న 48 మహా నగరాలలో మాత్రమే ”ఆన్ లైన్ తరగతులు” నిర్వహణ సజావుగా సాగుతోంది, కానీ 10 లక్షల లోపు నివసిస్తున్న 405 మధ్యస్థ నగరాలలో, 1 లక్ష లోపు జనాభా కలిగిన 2500 పట్టణాలలో ఒక మోస్తారుగా ” ఆన్ లైన్ తరగతులు” జరుగుతున్నాయి. కరోనా కాలంలో సాంకేతిక తరగతులే కాకుండా 21 రకాల సాంకేతిక బోధనా లు రావటం చూస్తుంటే విద్య ను ప్రభుత్వాలే వ్యాపారంగా మారుస్తున్నాయి, ఈ పెనుమార్పులు భవిష్యత్ తరాల విద్యార్థులు ఏవిధంగా నైపుణ్యం సాధిస్తారో సమాధానం లేని ప్రశ్న.
యునెస్కో గణాంకాల ఆధారంగా, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి (3.6 బిలియన్ల మంది) ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇదే భారత్ లో కనీసం 658 మిలియన్ ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో దాదాపు మూడింట ఒకవంతు మంది సాంకేతిక తరగతులు కు చేరలేకపోతున్నారు. చాలా మంది విద్యార్థులకు అవసరమైన మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ లు, ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్ లు లేవు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ప్రీ్ఖపైమరీ నుండి సెకండరీ స్కూల్ వరకు 500 మిలియన్లకు పైగా పిల్లలకు ఏ విధమైన సాంకేతిక సాధనాలు అందుబాటులో లేవు, వీరిలో మూడొంతుల మంది అత్యంత పేద కుటుంబాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ పరిణామాల వలన సాంకేతికత విద్యా #హక్కుకు ఈ విద్యార్థులు శాశ్వతంగా దూరమవుతారని స్పష్టమవుతుంది. సాంకేతిక విద్య యొక్క లాభ, నష్టాలు చూస్తే భౌతిక విద్య మాత్రమే విద్యార్థిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. కరోనా లాంటి భయానక పరిస్థితులు లేదా లోక్డౌన్ లాంటివి ఎదుర్కొన్నప్పుడు మాత్రమే తప్ప సాంకేతిక విద్య ను మిగిలిన సమయాల్లో ఉపయోగించకూడదు. పరీక్షలలో ప్రశ్నపత్రాల పేపర్లకు సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థులు కొంత కాపీ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతి విద్యార్థికి కచ్చితంగా భౌతిక తరగతి విద్య 90% మరియు సాంకేతిక విద్యని 10% రెండింటితో పాటు ముఖ్యంగా వ్యాయామంతో కూడిన హబ్రిడ్ విద్యా వ్యవస్థ వలన మంచి ఫలితాలు వస్తాయి. పాఠశాలలు కూడా వారివారి యూట్యూబ్ ఛానెల్లో క్రమం తప్పకుండా ముఖ్యమైన పాఠాలను ప్రసారం చేయటం కూడా మంచిది. ఆరోగ్య పరంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే సున్నితమైన వాస్తవాన్ని కూడా మనం గ్రహంచాలి. తల్లిదండ్రుల వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు మాత్రమే వారి పిల్లలు ఉపయోగిస్తున్నారు. ఇంకా, ఇంట్లో ఒకటి, రెండు స్మార్ట్ఫోన్ లే వున్నప్పుడు, ఆ కుటుంబంలో ఒకే పాఠశాలకు చెందిన ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే మరింత ఇబ్బందులు ఉంటాయి. ఈ సాంకేతిక విద్యతో విద్యార్థులపై, ప్రభుత్వాలపై ఆర్ధిక భారం పడుతుంది. సాంకేతిక విద్యకు అలవాటు పడితే భవిష్యత్ లో భౌతిక విద్యను విద్యార్థులు అస#హ్యంచుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆ్లనన్ పద్ధతులను సర్దుబాటు చేయడానికి కొన్నిసార్లు ఉపాధ్యాయులు చాలా కష్టమైన సమయాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతంలో కొన్ని చిన్న పాఠశాలలో ఇప్పటికీ టెలిఫోన్ కనెక్షన్లే లేవు, దీంతో ఆ విద్యార్థులు పరిస్థితి అగమ్యగోచరం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.