ఒంగోలు నగర శివారు ప్రాంతంలోని ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ చేసిన ట్రావెల్స్ బస్సులకు నిప్పు అంటుకోవడం… వెను వెంటనే వరుసగా ఎనిమిది బస్సులు అగ్నికి ఆహుతికావడం… కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగడం ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక దీని వెనుక కుట్రకోణం దాగి ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినప్పటికీ… బస్సులకు ఆకతాయిలే నిప్పు పెట్టారా? లేక మకరేదైనా ఉద్ధేశపూర్వకం ఉందా? అనే సమాధానం లేని అనేక ప్రశ్నలు ఎన్నో! అనుకోకుండా ఒక్క సారిగా మంటలు చెలరేగడం.. పక్కపక్కనే ఉన్న బస్సులకు మంటలు వ్యాపించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదికి పైగా నిలిచిపోయిన బస్సుల్లో ఒక్క సారిగా మంటలు వ్యాపించడంతో కావేరి ట్రావెల్స్‌కు సంబంధించిన ఎనిమిది బస్సులు దగ్ధమై.. రూ. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిన సంఘటన అంతా క్షణాల్లో జరిగిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..