అయోధ్య రామాలయ సందడి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ట్వీట్ ద్వారా పిలుపు ఇచ్చారు.
ఆలయం నుంచి పంపించిన అక్షితలను దేశవ్యాప్తంగా ప్రజలందరి ఇళ్లకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే అయోధ్యలో జనవరి 22న బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, భక్తి నిష్టలతో జరిపేందుకు అయోధ్య రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లలో ఉంది. జనవరి 22న దేశవ్యాప్తంగా ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు.
ప్యారీస్‌లో రథ యాత్ర …
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో అయోధ్య రామ మందిర వేడుకలు జరపబోతున్నారు. ఈ సందర్భంగా రామ రథ యాత్ర ఉంటుంది. జనవరి 21 మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ రథ యాత్రలో యూరప్ నలుమూలల నుంచి వచ్చే, 1000 మంది భక్తులు పాల్గొనబోతున్నారు. ఇలా ప్రపంచాన్ని భక్తిప్రపత్తులతో నింపేయబోతోంది అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం. దేశంలోని ప్రముఖ గాయకులు కూడా ఈ సందర్భంగా రామ భక్తి గీతాలు ఆలపిస్తూ, భక్తులలో ఉత్సాహాన్ని పెంచుతున్నారు.