ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో 50 పడకల సీహెచ్‌సీ ఆస్పత్రి ప్రారంభంతో పాటు 12-14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా అయిపోయిందని, ఇక లేదని అనుకోవడం పొరపాటు అన్నారు. కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చూపలేదని, టీకా అవసరం లేదనే నిర్లక్ష్య ధోరణి పెట్టుకోవద్దని హరీశ్‌రావు అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital