ఉత్తర ప్రదేశ్‌లోని లాల్‌గంజ్‌లో కడు పేదరికంలో పెరిగిన నలుగురు తోబుట్టువులు యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో అందరూ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులయ్యారు. గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా ఉన్న వారి తండ్రి అనిల్ ప్రకాశ్ మిశ్రా మాట్లాడుతూ ” నేను గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా ఉన్నప్పటికీ నా పిల్లల చదువుల నాణ్యతతో నేను ఎప్పుడు రాజీ పడలేదు. నా పిల్లల కు మంచి ఉద్యోగాలు రావాలని నేను కోరుకోన్నాను. వారు చదువులపై దృష్టిసారించారు” అని అన్నారు. నలుగురు తో బుట్టువుల్లో పెద్దవాడైన యోగేశ్ మిశ్రా ఐఏఎస్ అధికారి. మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ ఇంజనీరింగ్ చేశాడు.
అతను నోయిడాలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాడు. 2013లో యుపిఎస్‌సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. సివిల్ సర్వీసెస్‌కు బాగా సిద్దమైన యోగేశ్ మిశ్రా సోదరి క్షమా మిశ్రా మూడుసార్లు సివిల్స్ రాసినప్పటికీ నాలుగోసారి ఉత్తీర్ణ సాధించి ఐపిఎస్ అధికారి అయ్యింది. మూడో తోబుట్టువు మాధురి మిశ్రా లాల్‌గంజ్‌లోని కళాశాల నుండి గ్రాడ్యేయేషన్ పూర్తి చేసి అలహాబాద్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 2014లో సివిల్స్ పరీక్షలు రాసి జార్ఖండ్ కేడర్‌కు ఐఏఎస్ అధికారి అయ్యారు. అందరి కంటే చిన్న తోబుట్టువు లోకేశ్ మిశ్రా 2015లో సివిల్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిం చి జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయ్యాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.