కాశీలో గడిపిన ప్రతీ క్షణం అద్భుతంగా ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఏడు అంతస్థుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000మంది ధ్యానం చేసుకునే ఏర్పాటు చేశారు.
ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సాధువల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి, నవ నిర్మాణంపరంగా కొత్త రికార్డులు సృష్టించారని అన్నారు. సర్వవేద్ మహామందిర్ దీనికి ఉదాహరణ అని అన్నారు. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను మంత్రముద్ధుడినయ్యానని..వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీత, మహాభారతం వంటి దైవిక బోధనలు మహామందిర్ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయటం చూసి చాలా సంతోషంగా అనిపించిందన్నారు