హైదరాబాద్: రేపటి నుంచి కరోనా హెల్త్ బులిటిన్ ను ప్రతి రోజూ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. అలాగే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలని కోరింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగతుండటంతో రోజూ హెల్త్ బులిటిన్ విడుదలను ప్రభుత్వం నిలిపివేసింది. అందుకు కారణాలను హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది.. అలాగే కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు టెస్టుల వివరాలను నివేదికలో పేర్కొంది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని పేర్కొంది. వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు కోరింది.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలోమహారాష్ట్ర సరిహద్దులను మూసివేసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ సరిహద్దులలో కరోనా టెస్ట్ ల సంఖ్యను కూడా పెంచింది.. ఈ నేపథ్యంలోనే రోజు వారీ హెల్త్ బులిటిన్ విడుదల చేయాలని హైకోర్టు కోరింది . తదుపరి విచారణ మార్చి 18కి హైకోర్టు వాయిదా వేసింది.
ప్రతి రోజూ హెల్త్ బులిటిన్ – వ్యాక్సిన్ రిజిస్ర్టేషన్ పై విస్తృత ప్రచారంః హైకోర్టు ఆదేశం…
Advertisement
తాజా వార్తలు
Advertisement