సూయజ్ కాల్వలో ఇరుక్కుపోయిన నౌక వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇతర నౌక రాకపోకలకు మూడు రోజుల నుంచి అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా ఆర్థిక నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. సరుకు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోజుకు 69,520 కోట్లు డాలర్లు నష్టం వాటిల్లితున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక గంటకు 2,900 కోట్ల నష్ట జరుగుతోందని లాయిడ్స్ లిస్ట్ అనే షిప్పింగ్ సంస్థ లేక్కలేసి చెబుతోంది. ఒక నౌక అడ్డుగా ఉండటంతో ఇప్పటికే అటూ ఇటూ రెండు వైపులా 160 దాకా ఓడలు అక్కడ చిక్కుకుపోయాయి. ఇప్పుడు ఆ షిప్పును తీసేసినా.. అక్కడే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన షిప్పులను వాటి గమ్యస్థానాలకు చేర్చేందుకు సమయం పడుతుందని, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి రోజులు లేదా వారాలు పట్టొచ్చని అంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement