Tuesday, November 26, 2024

ఎవర్ గివెన్ కు భారీ జరిమానా

సూయజ్ కెనాల్‌లో కొద్ది రోజుల కిందట ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ ప్రపంచ వాణిజ్యానికి భారీ నష్టం కలిగించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఎవర్ గ్రీన్ నౌకా హాట్ టాపిక్ గా మారింది. ఎవర్ గివెన్ కార్గో నౌక యాజమాన్యానికి ఈజిప్ట్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 1 బిలియన్ డాలర్లు చెల్లిస్తే కానీ నౌకను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.దీనివల్ల రోజుల తరబడి ప్రపంచ వాణిజ్యం స్థంభించిపోయింది. దాదాపు వారం రోజులు కష్టపడి డ్రెడ్జర్లు, టగ్ బోట్ల సాయంతో ఆ నౌకను ఎలాగోలా పక్కకు తెచ్చిన అధికారులు నౌకను విడిచేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది.

అయితే ఎవర్ గివెన్ అడ్డంగా ఉండడంతో వందల నౌకలు దాని వెనుక నిలిచిపోయాయి. మొత్తంగా 369 నౌకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రతి రోజూ 9 బిలియన్ డాలర్లు(రూ.65.205 కోట్లు) నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ఈ కారణంగానే బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని వారు పట్టు పట్టి కూర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement